కుప్పం: కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోఒక కంటైనర్ టైరు పంచరైంది. దాంతో ఆ వాహనంలో తమిళనాడు రేషన్ బియ్యం వున్న విషయం వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పదుల సంఖ్యల్లో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
భారీగా తమిళనాడు రేషన్ బియ్యం స్వాధీనం