కాకినాడ, ఆగస్టు 17: ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్ షాపులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే కొత్త కార్డుల జారీపై కసరత్తు షురూ చేయగా… దుకాణాల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా కొత్తగా 4 వేల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ లో రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను పౌరసరఫరాల శాఖ పరిశీలించే పనిలో పడింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. ముందుగా కొత్తగా పెళ్లైన వారికి త్వరితగతిన కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే… రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పంపిణీ కేంద్రాలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. రేషన్ పంపిణీ మరింత సజావుగా సాగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 29 వేలకుపైగా రేషన్ దుకాణాలు ఉండగా…. కొత్తగా మరో 4 వేల కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. నిర్దేశిత సమయంలో లబ్ధిదారుడికి రేషన్ అందించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఎక్కువ రేషన్ కార్డులు ఏ పరిధిలో ఉంటే అక్కడ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై పౌరసరఫరాల నుంచి ప్రకటన వస్తుంది.ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో కొన్నింటికి ఇన్‌ఛార్డ్ డీలర్లు ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో… వాటిని గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. త్వరితగతిన ఆయా ఖాళీలను కూడా భర్తీ చేసే చర్యలను ప్రారంభించనుంది. ప్రాథమిక వివరాల ప్రకారం… 6 వేలకుపైగా డీలర్ల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారుకొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు.కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు. వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతామనిపేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.
Related Articles
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పై పాలకమండలి వేటు
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల…
సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కేవియట్ పిటీషన్
చట్ట విరుద్ధంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అర…
కుప్పం రైతులపై దాడి ఘటన డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో రైతులపై దాడి ఘటనపై రాష్ట్ర…