విజయవాడ, ఆగస్టు 17: వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఆరోపణలతో పోస్టింగ్ దక్కక వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు మెమోలు జారీ చేయడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్న పలు అంశాలపై దర్యాప్తును ప్రభావితం చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఆరోపణలతో పోస్టింగ్‌లకు దూరమైన ఐపీఎస్ అధికారులపై డీజీపీ చర్యలు చేపట్టారు. పోస్టింగ్ లేకపోవడంతో ఆఫీసుకు రాకుండా కాలక్షేపం చేస్తున్న ఐపీఎస్‌లపై బుధవారం కొరడా ఝుళిపించారు. హెడ్ క్వార్టర్లు విడిచి వెళ్లకూడదనే ఆదేశాలను పాటించకుండా పలువురు ఐపీఎస్‌లు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో చర్యలు చేపట్టారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులు రోజూ ఉదయం పదికల్లా ఆఫీసుకు రావాలని ఆదేవించారు.పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్నా ఐపీఎస్‌లు ఇకపై రోజూ డీజీపీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పత్తా లేకుండా పోయిన డీజీ స్థాయి నుంచి పలు హోదాల్లో ఉన్న ఐపీఎస్‌లు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 16మంది పేర్లతో కూడిన జాబితాతో డీజీపీ మెమో జారీ చేశారు. వీరంతా ఇకపై డీజీపీ కార్యాలయంలో రోజూ అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది.పోస్టింగ్ లేకపోవడంతో విధులకు హాజరు కాని ఐపీఎస్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీరిలో డీజీ స్థాయి అధికారులు పీవీ సునీల్ కుమార్, పిఎస్సార్ ఆంజనేయులు సహా 16మంది ఐపీఎస్‌లు ఇకపై రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఆఫీసర్స్ వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. ఉదయం పది నుంచి అందుబాటులో ఉండాలని విధులు ముగించుకుని వెళ్లే సమయంలో సమయం నమోదు చేయాలని అత్యవసర విధుల కేటాయింపుకు డీజీపీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.వెయిటింగ్‌లో ఉన్న వారిలో డీజీ క్యాడర్‌లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సిఐడి మాజీ చీఫ్ ఎన్.సంజయ్, విజయవాడ మాజీ సీపీ తాతా కాంతిరాణా, ఐజీ పాలరాజు, సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, సిహెచ్ విజయరావు, విశాల్ గున్నీ, ఎస్పీ క్యాడర్‌లో ఉన్న అన్బురాజన్, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పాటిల్‌సంజయ్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్ ఉన్నారు.డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం సాధారణమే అయినా, వారు రోజూ కార్యాలయాలకు వచ్చి అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశించడం వెనుక అసలు కారణాలు వెలుగు చూశాయి. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు మెమో జారీ వెనుక ఇంటెలిజెన్స్ నివేదికలు కారణంగా తెలుస్తోంది.ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇసుక తవ్వకాలు, మద్యం విక్రయాలు, ఏపీ ఫైబర్ నెట్ సహా పలు అంశాలపై విచారణకు ఆదేశించింది. వీటిలో కొన్ని కేసుల్ని ఏపీసీఐడీకి అప్పగించింది. ఈ పరిణామాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులు కుట్రలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఉన్న అధికారుల్లో.. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. వీరంతా రకరకాల స్థాయిల్లో పలు కేసుల్ని నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కేసుల్ని దర్యాప్తు చేస్తున్న అధికారులను, పోలీస్ సిబ్బందిని వెయిటింగులో ఉన్న ఐపీఎస్ లు తమ వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. దర్యాప్తు బృందాలను విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా విచారణ ముగించాలంటూ వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్ లు ప్రభావితం చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.కొన్ని కేసుల్లో తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని ఐపీఎస్ అధికారులు సూచించడంపై ఆధారాలతో సహా నివేదికలను ప్రభుత్వానికి అందించారు. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రభుత్వం గుర్తించడంతో శాఖపరమైన చర్యల్లో భాగంగా మెమోలు జారీ చేసినట్టు తెలుస్తోందవెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల తీరుతో కంగుతిన్న ప్రభుత్వ పెద్దలు, వైసీపీకి అనుకూలంగా ఇప్పటికీ పని చేస్తున్న వారిని గుర్తించాలని పోలీసు బాధ్యులకు సూచించినట్టు సమాచారం. పలు కేసుల దర్యాప్తులో అటంకం కల్పించే ప్రయత్నాలపై చర్యలు తీసుకోడానికి సిద్ధం అవుతోంది.ఈ పరిణామాలతో అప్రమత్తమైన డీజీపీ కార్యాలయం, వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులను రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్ లో సంతకాలు చేసి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహితలో కేసు విచారణను ప్రభావితం చేయడం కూడా నేరంగా పరిగణిస్తున్న నేపథ్యంలో చట్టపరమైన చర్యలకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Related Articles
ఎంతైనా అన్నదమ్ములే కదా.. చెరోపార్టీలో ఉన్నా ఒకరిపై ఒకరు పోటీ చేయమంటున్న అమంచి బ్రదర్స్.. కారణం అదేనా..?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకులు… వీళ్ళిద్దరూ అన్నదమ్ములు.. శ్రీకృష్ణుడికి బలరాముడు ఎలాగో, ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లో రాణించడానికి తెరవెనుక బలరాముడిలా కాపు కాసిన వ్యక్తి ఆమంచి.. ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు ఉమ్మడి ప్రకాశం […]
ఏపీ ప్రభుత్వం పవన్ పుట్టినరోజును టార్గెట్ చేసి ఫ్లెక్సీలపై నిషేధం విధించింది – వంగలపూడి అనిత
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రీసెంట్ గా విశాఖపట్నం పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖపట్నం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని, […]
జగన్ కు కలిసొస్తున్న కాలం…
జకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ అధికారం నిలబ…