తెలంగాణ రాజకీయం

గాంధీపై హత్యాయత్నం కేసు

మూడు రోజులు తెలంగాణ రాజకీయాలను కాకా పుట్టిస్తున్న అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యు తీసుకున్నారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు కుమారుడు, మరో ఇద్దరు నేతలను కూడా ఈ కేసులో చేర్చారు. పీఏసీ ఛైర్మన్‌గా చేయడం వివాదం మొదలైంది. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవడం మానేసి వారికి పదవులు ఇవ్వడం ఏంటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడాని కంటే ముందే వాళ్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము పంపించిన గాజులు చీర ధరించి ప్రజల్లో తిరగాలని అన్నారు. ఈ క్రమంలో పార్టీ మారిన గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇంకా బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిజంగా పార్టీలో ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడాలని సూచించారు. లేదంటే తానే గాంధీ నివాసానికి వెల్లి ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని చెప్పారు. ఇలా మొదలైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

గాంధీ ఇంటికి బయల్దేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే ఇంతలో తన అనుచరులతో గాంధీ మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. గాంధీ అనుచరులు కొందరు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద విధ్వంసం సృష్టించారు. అటు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా కోడిగుడ్లు, టమోటాలతో ఎదురు దాడి చేశారు. ఇటు నుంచి రాళ్లు ఇతర వస్తువులతో గాంధీ అనుచరులు దాడి చేశారు. ఇలా గురువారం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద యుద్ధ వాతావరణం తలపించింది. పోలీసులు జోక్యం చేసుకొని గాంధీని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే సాయంత్రానికి పోలీసు కమిషనరేట్ వద్ద మళ్లీ హడావుడి మొదలైంది. కౌశిక్ రెడ్డికి మద్దతు సీన్‌లోకి బీఆర్‌ఎస్ కీలక నేతలు హరీష్‌సహా ఇతరులు వచ్చారు. ఈ హైడ్రామా అర్థరాత్రి వరకు కొనసాగింది. శుక్రవారం కూడా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంట్లో సమావేశానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డిని కూడా మరోసారి హౌస్ అరెస్టు చేశారు. ఇలా రెండు రోజుల పాటు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విధ్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. గాంధీని విమర్శించే క్రమంలో కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాళ్లు అంటూ తేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ల గళాటా చేసిన గాంధీతోపాటు ఆయన బంధువులు, అనుచరులపై కేసులు పెట్టింది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి విధ్వంసం చేసిన కేసులో  అరికెపూడి గాంధీ, ఆయన సోదరుడు, కుమారుడితోపాటు కార్పొరేటర్లు, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. ఇప్పుడు ఇది తెలంగాణలో తీవ్రం సంచలనంగా మారుతోంది.