భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇస్రో పంపిన ప్రతిపాదలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చంద్రయాన్-4 మిషన్, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు నిధులు సైతం కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేబినెట్ చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో 2026 నాటికి చేపట్టాలని భావిస్తున్నది. రెండు దశల్లో చంద్రయాన్-4 మిషన్‌ను నిర్వహిస్తుంది.రెండుదశల్లో భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత స్పేస్‌లోనే కనెక్ట్ చేయనున్నారు. ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి.. తిరిగి భూమిపైకి చేరుకుంటుంది.
ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్ చరిత్ర లిఖించనున్నది. ఇక భారత్ గగన్ యాన్ ప్రాజెక్టును సైతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఇందులో భాగంగా వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇందు కోసం వ్యోమగాములను సైతం ఎంపిక చేసిన శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భూమికి దగ్గరలో ఉన్న వీనస్‌పై అధ్యయనం చేయనున్నది. ఇందులో వీనస్ వాతావరణంపై పరిశోధనలు జరుపనున్నది. అలాగే, తర్వాతి తరం లాంచ్ వెహికల్‌కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. తక్కువ భూకక్ష్యలో 30 టన్నుల పేలోడ్‌ను ప్రవేశపెట్టడం దీని లక్ష్యం.