ఆఫ్రికా దేశమైన మాలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఘటనలో మరో 33 మంది గాయపడ్డారు. సామగ్రి, కార్మికులతో వెళ్తున్న ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, మరో మార్గంలోకి దూసుకువెళ్లి బస్సును ఢీకొట్టింది.
సెగౌ పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఘటన చోటు చేసుకున్నది. ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని దవాఖానకు తరలించినట్లు అధికారులు తెలిపారు.