తెలంగాణ రాజకీయం

రేవంత్ పై మోడీకి ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాం అని గ్రూప్స్ అభ్యర్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని అభ్యర్థులు ఆరోపించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు జీవో నెంబర్ 29 ని అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ మరియు ఎస్సి విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, వర్గీకరణ చేపట్టకుండా అక్రమంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 పరీక్షకు మహిళా రిజర్వేషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రస్తావించారు. అక్రమ చర్యల ద్వారా అనేకమంది స్థానికేతర విద్యార్థులను ఆహ్వానించారని, గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిని అధికారం, డబ్బుతో తారుమారు చేసి ప్రభావితం చేసి  తీర్పును మార్చారని ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు.

ఈ పరిణామాలన్నీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అసమర్ధమైన కాంగ్రెస్ మిత్రులతోని ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో ఆడుకుంటుందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ప్రధాని గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థుల కు సరైన న్యాయం అందించడంలో మీ వంతు సహాయం చేయాలని తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ఆ ఈమెయిల్లో మోడీకి ఫిర్యాదు చేశారు.
ఈ 21 నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 వాయిదాపూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తెలంగాణలో గ్రూప్ వన్‌ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఉన్న వేళ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసి నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.  
అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ ఆటంకం లేకుండా హైకోర్టు తీర్పు వెల్లడించింది. యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ పై అభ్యంతరాలు ఉన్నాయని, రిజర్వేషన్లకు సంబంధించి జీవో 33 సహా పలు అంశాలపై అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ ఇదివరకే విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై వేసిన పిటిషన్లుడిస్మిస్‌ చేస్తూ మెయిన్స్ పరీక్షకు అడ్డంకులు తొలగించింది. అక్టోబర్ 21 నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అక్టోబర్ 14న మెయిన్స్ హాల్‌టికెట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.