తెలంగాణ రాజకీయం

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న సంఘటనలు

రాజ్ పాకాల కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయులకే ఆ పార్టీ ఇచ్చాడని చెప్పాడు. కానీ.. ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అయితే.. ఇంతటి వ్యతిరేక ప్రచారం రావడానికి కారణాలూ లేకపోలేదు. ‘మనం ఏది చేస్తా.. మనకు అదే వస్తుంది’ అన్నట్లుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రాజకీయమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం సంచలనాలు నమోదయ్యాయి. ఓ చిన్న పార్టీ చివరకు కేసీఆర్ ఫ్యామిలీని రచ్చకీడ్చింది. కేసీఆర్ కుటుంబం వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ఫ్యామిలీ పార్టీ కాస్త ఈ వివాదానికి కారణమైంది. నిన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌజ్‌లో జరిగిన పార్టీ చిలికిచిలికి గాలివానగా మారింది. చివరకు పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే.. అది ఫ్యామిలీ పార్టీ అయినప్పటికీ పెద్ద కేసుగానే ప్రచారం జరిగింది. కానీ.. కాస్త ఆలోచిస్తే ఇది అంత పెద్ద కేసు కాదని అర్థం చేసుకోవచ్చు. కేవలం ఫ్యామిలీ కోసమే రాజ్ పాకాల ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. దీనిపై కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

రాజ్ పాకాల కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయులకే ఆ పార్టీ ఇచ్చాడని చెప్పాడు. కానీ.. ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అయితే.. ఇంతటి వ్యతిరేక ప్రచారం రావడానికి కారణాలూ లేకపోలేదు. ‘మనం ఏది చేస్తా.. మనకు అదే వస్తుంది’ అన్నట్లుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రాజకీయమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రాజ్ పాకాల తన ఫాంహౌస్‌లో నిర్వహించింది చిన్నపాటి లిక్కర్ పార్టీనే అనేది తెలుస్తోంది. కాకుంటే అనుమతి లేకుండా నిర్వహించడాన్ని పోలీసులు తప్పుపట్టారు. ఈ క్రమంలో చిన్నపాటి కేసు నమోదయ్యే అవకాశాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు ఫాంహౌస్ ఓనర్, పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలనే కనిపించకుండా పోవడంతో సీరియస్‌గా మారిపోయింది. మరోవైపు.. పార్టీలో పాల్గొన్న వారికి చేసిన టెస్టుల్లోనూ ఒకరికి కొకైన్ పాజిటివ్‌గా తేలింది. తనకు రాజ్ పాకాలనే ఆ కొకైన్ ఇచ్చినట్లుగా సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ వివాదం కాస్త డ్రగ్స్ వైపునకు దారితీసింది. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రగ్స్ వాడినట్లుగా ప్రచారం ఉంది.

అయితే ఈ పార్టీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాల్గొన్నట్లుగా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. పోలీసులు వచ్చే కాసేపటికే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని పలువురు ఆరోపించడం కనిపించింది. పార్టీలో నుంచి వెళ్లిపోతున్నట్లు కేటీఆర్‌కు సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన పాల్గొన్నది లేనిది ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా.. రాజ్ పాకాల కనిపించకుండా పోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఓరియన్ విల్లాస్లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు బద్దలు కొట్టారు. సోదాలకు ప్రయత్నించారు. ఆ తర్వాత నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దాంతో ఈ మందు పార్టీ వ్యవహారం కాస్తా బీఆర్ఎస్‌లో ప్రకంపనలకు దారితీసింది. దీనిని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియక గులాబీ పార్టీ నేతలు సతమతం అవుతున్నారని తెలుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో ఒకవిధంగా ఉండేవి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే కొలువుదీరిందో అప్పటి నుంచి రాజకీయాలు ఇంట్రస్టింగ్‌గా మారాయి.

రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రాప్ చేయడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం వంటి రాజకీయాలు చాలా వరకు పెరిగిపోయాయి. అవి ఎంతలా అంటే బీఆర్ఎస్ హయాంలో కిందిస్థాయి నుంచి పెద్దల స్థాయి వరకూ ఈ కుట్రలు జరిగాయని అందరూ చెప్పే మాటే. కేసులు నిర్ధారణ కాకున్నా కొంత మందిని అరెస్టు చేసి రోజుల తరబడి జైళ్లో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. వారిపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ్ ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ నేతలు కానీ.. ఇటు బీజేపీ నేతలు కానీ.. అందరూ ఈ బాధలు అనుభవించారు.అయితే.. గతంలో ఆ బాధలు అనుభవించిన వారంతా ఇప్పుడు వివిధ పదవుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఓ నాయకుడి వాయిస్ కాస్త గట్టిగా వినిపిస్తున్నది అంటే.. అతడిని గత బీఆర్ఎస్ హయాంలో తొక్కిపెట్టే ప్రయత్నమే జరిగిందని చెప్పాల్సిందే. ప్రతీ నేత బీఆర్ఎస్ కుట్రలకు బలైన వారే. అలా.. ముందుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేల ట్రాప్ అంటూ బీజేపీని ట్రాప్ చేశారు. బీజేపీ అగ్రనేతలను అరెస్టు చేసేందుకూ నానా హంగామా చేశారు. చివరకు ఆ కేసులో కూడా బీఆర్ఎస్ అభాసుపాలైంది.

పక్క రాష్ట్రాల కోసం డేటా చోరీ అంటూ మరో గేమ్‌కు తెరలేపారు. పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ కుమార్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక అరెస్టులు ఉన్నాయి. ఎన్నో కుట్రలూ ఉన్నాయి. పదేళ్ల కాలంపాటు అధికారంలో ఉన్నామని అడ్డగోలు రాజకీయాలు బీఆర్ఎస్ చేసింది. అవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి చర్చకు వచ్చాయి. దాంతో ఇప్పుడు గులాబీ పార్టీకి కనీసం సానుభూతి దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజ్ పాకాల కేసు విషయంలోనూ ఎవరూ పెద్దగా వ్యతిరేకించడంలేదు. గతంలో చేసిన వాటికి ఈ మాత్రం ఎదుర్కోక తప్పదనే కామెంట్స్ వినిపిస్తుండడం బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తెలుపుతోంది.