జాతీయం రాజకీయం

5నెలల ముందే ఆప్ పేర్లు ప్రకటన

 అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ పురుడు పోసుకుంది. పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో ఈ పార్టీని ప్రారంభించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు షాక్‌ ఇచ్చి.. ప్రారంభించిన ఏడాదికే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్‌. పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పంజాబ్‌లోనూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఉత్తర భారత దేవంలోని గోవా, గుజరాత్, హర్యాన, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలోనూ పోటీ చేసిన ఆప్‌.. ఎన్నికల నిబంధనల మేరకు ఓట్లు సాధించి జాతీయ పార్టీగా కూడా గుర్తింపు పొందింది. ఇక ఎన్నికల వేళ.. అరవింద్‌ కేజ్రీవాల్‌ నుసరించే వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. రాజకీయాల్లో ఆరితేరిన నేతలకు భిన్నంగా కేజ్రీవాల్‌ ఆలోచిస్తారు. వ్యూహాలు రచిస్తారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆయన సీఎం అభ్యర్థిని ప్రజల అభిప్రాయం మేరకే ఎంపిక చేశారు. ఈమేరకు టెర్నాలజీ సాయంతో ఓటింగ్‌ కోరారు. ఆప్‌ విధానాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కూడా అందులో చేరారు. ఇక పంజాబ్‌లో కూడా ప్రస్తుతం ఆప్‌ అధికారంలో ఉంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్న అర్వింద్‌ కేజ్రీవాల్‌ నాలుగు నెలలు జైల్లో ఉన్నారు. సీఎంగా జైలు నుంచే పాలన సాగించారు. అయితే బెయిల్‌ మంజూరైన తర్వాత సీఎం పదవికి రాజీరామా చేశారు. అతిషిని తన వారసురాలుగా సీంఎ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలో కోసమే పార్టీని మరింత బలోపేతం చేయడానికి అరవింద్‌ కే జ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ కోసం ఢిల్లీలో పాదయాత్ర కూడా చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. కానీ, పాదయాత్ర చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో 11 మంది పేర్లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తొలి పార్టీగా ఆప్‌ నిలిచింది.
ఇక కేజ్రీవాల్‌ ప్రకటించిన ఆఫ్‌ ఫస్ట్‌ లిస్ట్‌లో ఛత్తర్పూర్‌ నుంచి బ్రహ్మ సింగ్, తన్వార్, కిరాడి నుంచి అనిల్‌ ఝూ, విశ్వాస్‌నగర్‌ నుంచి దీపక్‌ సింగ్లా, రోహతాన్‌ నగర్‌ నుంచి సరితాసింగ్, లక్ష్మీనగర్‌ నుంచి బీబీ.త్యాగి, బదార్పూర్‌ నుంచి రామ్‌ సింగ్, సీలన్‌పూర్‌ నుంచి జుబీర్‌ చౌధురి, సీమాపురి నుంఇ వీర్‌ సింగ్‌ ధిగాన్, హోండా నుంచి గౌరవ్‌శర్మ, కర్వాల్‌ నగర్‌ నుంచి మనోజ్‌ త్యాగి, మాటియాల నుంచి సోమేష్‌ షౌకీన్‌ పేర్లు ప్రకటించారు. 11 మందిలో ఆరుగురు కాంగ్రెస్‌. బీజేపీ నుంచి ఆప్‌లో చేరిన వారే ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మసింగ్‌ తన్వర్, అనిల్‌ ఝూ, బీబీ త్యాగితోపాటు కాంగ్రెస్‌ మాజీ నాయకులు చైదరి జుబేర్‌ అహ్మద్, వీర్‌ ధింగన్, సుముష్‌ సోకీన్లను అభ్యర్థులుగా కేజ్రీవాల్‌ ప్రకటించారు. ముగ్గురు సిట్టింగ్‌కు కేజ్రీవాల్‌ టికెట్‌ నిరాకరించారు