క్రీడలు తెలంగాణ

నీ మనసు బంగారం తల్లీ :మెగాస్టార్ చిరంజీవి

మీరాబాయి చానుపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు

మెగాస్టార్ చిరంజీవి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్‌లో పత‌కం తీసుకొచ్చిన మణిపూర్‌ మీరాబాయి చాను వ్యక్తిత్వంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆమె భార‌త్ చేరుకున్న త‌ర్వాత.. త‌న‌కు గ‌తంలో సాయం చేసిన వారిని క‌ల‌వ‌డం ప‌ట్ల చిరంజీవి ఎంతగానో మెచ్చుకున్నారు.

‘మీరాబాయి చాను.. దేశం గ‌ర్వించేలా ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన ఇండియ‌న్. ఇంటికి చేరిన రోజు నుంచి కొంద‌రు వ్య‌క్తుల కోసం ఆమె వెతుకుతూనే ఉంది. చివ‌రికి వారంద‌రినీ ఇంటికి పిలిచింది. మొత్తం 150 మంది ఉన్నారు. అంద‌రికీ భోజనాలు పెట్టి, బ‌ట్ట‌లు పెట్టి, కాళ్లు మొక్కింది.

ఇంత‌కీ వాళ్లంద‌రూ ఎవ‌రో తెలుసా? త‌న ఊరి నుంచి పాతిక మైళ్ల దూరంలో ఉన్న ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్లేందుకు, మీరాబాయికి రోజూ లిఫ్ట్ ఇచ్చిన ట్ర‌క్ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు, హెల్ప‌ర్లు. ఇది క‌దా గెలుపు మ‌లుపులో సాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రి ప‌ట్ల కృత‌జ్ఞ‌త చూప‌డం అంటే! నీ మ‌న‌సు బంగారం తల్లీ. సెల్యూట్ మీరాబాయి చాను’ అంటూ చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు.