తెలంగాణ

హైదరాబాద్ నుంచి దుబాయ్ విమానంలో ముగ్గురే జర్నీ

తెలంగాణ ఎన్నారై ఫ్యామిలీకి దక్కిన అద్భుత అవకాశం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రమే హైదరాబాద్ నుంచి దుబాయ్ విమానంలో వెళ్లారు. అయితే వారు ప్రత్యేకంగా బుక్ ఫ్లైట్ ను బుక్ చేసుకున్నారని అనుకుంటున్నారా ? అదేం కాదు. సాధారణ ప్రయాణికులుగా టికెట్లు బుక్ చేసుకున్నారు … ఇదిలావుండగా ఎవరికీ లభించని ఓ అద్భుత అవకాశం వీరికి దక్కింది. విమానంలో ఈ ముగ్గురు మినహా ఇతరు ప్రయాణికులు ఎవరూ లేకపోవడం విశేషం. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండానే ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి దక్కింది. ఏది ఎలా ఉన్నపటికీ 180 మంది ప్రయాణించే విమానంలో ముగ్గురు తో ఈ కుటుంబం మాత్రమే ప్రయాణించింది. హైదరాబాద్‌ టు షార్జా.. ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరీం నగర్ కు చెందిన శ్రీనివాసరెడ్డి, హరితరెడ్డి భార్యాభర్తలు పదేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. హరితరెడ్డి దుబాయ్ లో డాక్టర్ గా పని చేస్తుండగా… శ్రీనివాసరెడ్డి టెక్ మహీంద్రాలో ఉద్యోగం . . ఏప్రిల్ 18న హరితరెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి మృతి చెందడంతో… తమ కొడుకు సంజిత్ రెడ్డితో కలిసి అదే రోజున ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో కరోనా కేసులతో భారత విమానాలపై యూఏఈ నిషేధం విధించటంతో ఇక్కడే ఉండిపోయారు. మధ్యలో ఆరుసార్లు విమాన టికెట్లను కొన్నా నిబంధనలు మారుతుండటంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్న వారు రావచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో… వీరిద్దరూ దుబాయ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి యూఏఈ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో దుబాయ్ కు పయనమయ్యారు. అయితే, విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో… వీరు ముగ్గురితోనే విమానం బయల్దేరింది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిర్ బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం షార్జాకు చేరుకుంది.