సింగరేణిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నేటినుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్‌కు సంస్థకు సంబంధించిన దవాఖానల్లో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా టీకా వేసుకోవాలని సింగరేణి సూచించింది. సంస్థ ఉద్యోగులకు ఈ నెల 23 నుంచి కరోనా రెండో డోసు టీకాలను పంపిణీ చేయనున్నారు. సంస్థ ఉద్యోగుల కోసం జూలై 13 మెగా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించింది. కార్మికులకు వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో ఉండేలా సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాల్స్‌లో వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Covid vaccination: నేటి నుంచి సింగరేణిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కరోనా టీకా