2డీజీ ( 2DG )ఔషధం చాలా ప్రభావంతంగా పనిచేస్తున్నదని డాక్టర్లు తనకు తెలిపారని, ఆ ఔషధాన్ని వాడడం వల్ల కరోనా రోగుల్లో ఆక్సిజన్ స్థాయి అమాంతంగా పెరుగుతందని ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఔషధాన్ని మరే దేశం కూడా తయారు చేయలేదని మంత్రి చెప్పారు. కానీ భారతీయ శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని సాధించినట్లు ఆయన వెల్లడించారు. మన దేశానికి చెందిన సైనిక దళాలు, శాస్త్రవేత్తలు ఎన్నడూ దేశాన్ని నిరుత్సాహపరచలేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో.. డీఆర్‌డీవో నేతృత్వంలో తయారు చేసిన 2డీజీ ఔషధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ ఢిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో.. భారత్‌కు గోల్డ్ మెడల్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఉండేదని, కానీ సుబేదార్ నీరజ్ చోప్రా అద్భుతం సాధించాడని, జావెలిన్ త్రో ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.