నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 9 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సీఐ, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోలీసు స్టేషన్‌లోని సిబ్బంది కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకే స్టేషన్‌లో ఇంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయా కేసుల విషయంలో స్టేషన్‌కు వచ్చి సిబ్బందిని సంప్రదించిన వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Corona Virus : కావలి పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం.. సీఐతో సహా 9 మందికి పాజిటివ్