ఆంధ్రప్రదేశ్

Eco Zone : నాగార్జున సాగర్‌- శ్రీశైలం ఎకో జోన్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

నాగార్జున సాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యం రిజర్వ్‌ ప్రాంతాలను ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు ఇవాళ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర అటవీశాఖ ఆమోదం తెలిపింది. పులుల అభయారణ్యం విస్తరించిన రిజర్వ్‌ ప్రాంతాలను ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభయారణ్యం నుంచి 26 కిలోమీటర్ల వరకు ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. సుమారు 3727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇందులో కొత్తగా 2149 చదరపు కిలోమీరట్ల ప్రాంతాన్ని కేంద్ర అటవీశాఖ ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది.