తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్‌తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణాను నిలిపివేశారని, తద్వారా దేశం నుంచి దిగుమతులను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్ (డీజీ) డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు. ‘ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు పాకిస్తాన్ రవాణా మార్గం ద్వారా వస్తాయి. ప్రస్తుతానికి తాలిబన్లు పాకిస్తాక్‌కు సరుకు రవాణాను నిలిపివేశారు. వాస్తవంగా దిగుమతులు ఆగిపోయాయి’ అని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల్లో భారతదేశం దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉంది. ‘మేం ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద భాగస్వాముల్లో ఒకరం. ఆ దేశానికి మా ఎగుమతుల విలువ 2021 నాటికి 835 మిలియన్ డాలర్లు. మేం సుమారు 510 డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం. వాణిజ్యం కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో గణనీయమైన పెట్టుబడులున్నాయి. మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాం. 400 బేస్ ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని జరుగుతున్నాయి’ అని చెప్పారు. కొన్ని వస్తువులు అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ మార్గం ద్వారా వెళ్లాయని, మరిన్ని వస్తువులు దుబాయి మార్గం ద్వారా వెళ్లాయని చెప్పారు. వాణిజ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.- Advertisement –
ప్రస్తుతం, చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ప్రసార టవర్లు ఎగుమతి చేస్తుండగా.. దిగుమతుల్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్‌పై ఆధారపడ్డట్లు చెప్పారు. గమ్, ఉల్లిపాయలు సైతం దిగుమతి చేసుకుంటున్నట్లు డీజీ అజయ్ సహాయ్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలపై ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆఫ్ఘన్‌లో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగుమతి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపు 85 శాతం డ్రై ఫ్రూట్‌లను భారత్ దిగుమతి చేసుకుంటోంది.