జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 1,51,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 252 రోజుల్లో ఇదే అతితక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో 3,36,97,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, మరో 4,59,191 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. గత 24 గంటల్లో 311 మంది మరణించగా, 14,159 మంది కరోనా నుంచి బయటపడ్డారని వెల్లడించింది.