తెలంగాణ ముఖ్యాంశాలు

సీఎంఆర్‌ఎఫ్‌కు సన్‌ ఫౌండేషన్‌ 3 కోట్ల విరాళం

కరోనాపై పోరులో మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సన్‌ ఫౌండేషన్‌ రూ.3 కోట్లు విరాళం అందించింది. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు జెమినీ టీవీ తెలుగు అధినేత పీ కిరణ్‌ చెక్కు అందజేశారు. భూరి విరాళం ఇచ్చినందుకు కిరణ్‌కు కేటీఆర్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.