జాతీయం ముఖ్యాంశాలు

బీజేపీ సభ అట్టర్‌ఫ్ల్లాప్‌

  • జనం లేక జనగామ సభాప్రాంగణం వెలవెల
  • కాంగ్రెస్‌ డప్పులతో స్వాగతం..
  • కాళ్లకింద కేంద్ర మంత్రి కటౌట్లు
  • ఆకట్టుకోని కిషన్‌రెడ్డి ప్రసంగం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్ర అట్టర్‌ఫ్ల్లాప్‌ అయ్యింది. జనగామ చౌరస్తా సెంటర్‌లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభ జనాలు లేక వెలవెలబోయింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షుడి పేరిట ఉన్న డప్పులను కళాకారులు కేంద్ర మంత్రికి స్వాగతం చెప్పేందుకు వాడితే.. స్వాగతం పలికిన జనాలు, కార్యకర్తలే ఆయన ఫొటోను కాళ్లకింద వేసి తొక్కుతూ సభలో ప్రసంగాన్ని విన్నారు. ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రికి అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉండగా, జనగామ జిల్లా కేంద్రంలో భారీ ఏర్పాట్లతో నిర్వహించిన సభకు ప్రజలు రాకపోవడంతో కేవలం కళాకారులు, కొద్దిమంది కార్యకర్తలతో పలుచగా కనిపించింది. కొద్దిపాటిగా హాజరైన బీజేపీ కార్యకర్తలు, ప్రజలు సైతం కిషన్‌రెడ్డి ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు.