తెలంగాణ ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేదు : మంత్రి తలసాని

బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టాలన్న తలసాని

కెసిఆర్‌ ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేదు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగసభపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ప్రసంగం చాలా చప్పగా సాగిందని అన్నారు. హైదరాబాద్ అందాలను చూసి మోడీ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగడం లేదని ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని తలసాని విమర్శించారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని చెప్పారు. నిన్న జరిగిన సభలో నీళ్లు, నిధుల గురించి కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారని… రెండ్రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/