జాతీయం

Train derailed: ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. బోల్తాప‌డ్డ 14 బోగీలు..!

బీహార్‌లో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌ర్హ్‌లోని నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌కు బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు న‌లంద ఏరియాలోని నేక్‌పూర్ వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది ( Train derailed ). ఈ ప్ర‌మాదంలో రైలులోని 14 బోగీలు బోల్తా ప‌డ్డాయి. అయితే ప్ర‌మాదం కార‌ణంగా ఆ మార్గం గుండా న‌డిచే అన్ని ర‌కాల రైళ్ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్ర‌మాదానికి గురైన‌ గూడ్స్ రైలును ప‌ట్టాల‌పై నుంచి పూర్తిగా తొల‌గించి, పట్టాలు మ‌ర‌మ్మ‌తు చేయ‌డానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి కాగానే ఆ మార్గం గుండా రైళ్ల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేస్ అసిస్టెంట్ ఇంజినీర్ వీకే సిన్హా తెలిపారు.