జాతీయం ముఖ్యాంశాలు

Corona Positive: 44,658 మందికి కొత్త‌గా వైర‌స్‌.. 496 మంది మృతి

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 44,658 క‌రోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. మ‌రో వైపు క‌రోనా వ‌ల్ల 496 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వైర‌స్ సంక్ర‌మించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంట‌ల్లో ఎక్కువ సంఖ్య‌లో కేసులు కేర‌ళ‌లో న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 30 వేల కేసులు వ‌చ్చాయి. 162 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.