జాతీయం ముఖ్యాంశాలు

బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

దేశానికి థార్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిపదలో ఉన్న సెయిట్‌ జోసెఫ్‌ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 26 మందికి పాజిటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు. వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని తెలిపారు. వారిని నాయర్ దవాఖానకు తరలించామన్నారు. మిగిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించమని చెప్పారు. కరోనా నిలయంగా మారిన సెయింట్‌ జోసఫ్‌ బోర్డింగ్‌ స్కూల్‌ను బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు.

బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా