తెలంగాణ ముఖ్యాంశాలు

గ్రూప్ III పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

గ్రూప్- III  రాత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులకు పటిష్టమైన బందోబస్తు గురించి కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ దిశా నిర్దేశం చేసారు.
సిద్దిపేట పట్టణంలో 37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. గ్రూప్- III  రాత పరీక్ష కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్  -2023 సెక్షన్ అమలు లో వుంటుంది. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే అధికారులు సిబ్బంది ఉదయం 6 గంటలకు హాజరులో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రాన్ని వదిలి బయటకు వెళ్ళవద్దు, పరీక్ష కేంద్రం లోనికి ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకుని వెళ్లడానికి అనుమతి లేదు,  ప్రతి ఒక్క అభ్యర్థిని స్క్రీన్ చేసి లోపలికి పంపించాలి, విధినిర్వహణకు వచ్చే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బందితో మరియు పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులతో మర్యాదగా ప్రవర్తించాలి,  బందోబస్తు విషయంలో  ఏవైనా సమస్యలు ఉంటే  ఎగ్జామ్స్ పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఉదయం 9:30 గంటలకు మరియు మధ్యాహ్నము 2:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు,  పరీక్ష వేళలు: ఉదయం 10:00 నుండి 12:30 గంటల వరకు మరియు మద్యాహ్నం 3:00 గంటల నుండి 5:30 గంటల వరకు నిర్వహించబడుతుంది.  అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 8:00 గంల వరకు చేరుకోవాలి. సిద్దిపేట పట్టణంలో 37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు, ఎవరైనా అభ్యర్థులు ఒక సెంటర్ కు వెళ్లే బదులు వేరే సెంటర్ కు వెళితే  అక్కడ విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది వెంటనే స్పందించి వారిని ఆ సెంటర్కు పంపించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల చుట్టూ 360 డిగ్రీ  ఆవరణలో పటిష్టమైన బందోబస్తు  ఏర్పాటు చేయడం జరుగుతుంది  పరీక్షా కేంద్రాలకు సమీపంలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ డీసీపీ లు 3, ఏసీపీలు 4, సీఐలు 8, ఎస్ఐ లు37, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు,హోంగార్డులు 335. మొత్తం పోలీస్ అధికారులు సిబ్బంది 381 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం  జరిగింది.4 రూట్ మొబైల్స్, 4 ఎస్కార్ట్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, సిసిఎస్ ఎసిపి యాదగిరి, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, మరియు ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.