తెలంగాణ ముఖ్యాంశాలు

రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట సాగుకు ప్రాధాన్యం: మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయంగా వేరు శ‌న‌గకు డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంల రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట సాగును పెంచుతామ‌ని వెల్ల‌డించారు. న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిట్యాల‌లోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంట‌సాగును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్న‌ద‌ని చెప్పారు. త్వరలో సాగు విస్తీర్ణాన్ని 6 లక్షల ఎకరాలకు పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు పల్లీ పట్టీలు అందించేందుకు ఆమోదం తెలిపింద‌ని, ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని విద్యార్థుల‌కు ప‌ల్లి ప‌ట్టీలు అందిస్తామ‌ని చెప్పారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పల్లీ పంటకు ప్రాధాన్యత ఇస్తామ‌న్నారు. దేశంలో అత్యధికంగా గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పల్లీ పంటను సాగు చేయబోతున్న‌ద‌ని వెల్ల‌డించారు.