ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చర్చా వేదిక పెట్టే హక్కులేదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా? అని ప్రశ్నించారు. గంగవరం పోర్టుపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు.
‘‘పెట్రోల్ ధరల పెంపుపై మేం అసంతృప్తిగా ఉన్నాం. పెట్రోల్ ధరలు కేంద్రం పరిధిలో ఉందన్న విషయం టీడీపీకి తెలియదా?. ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నీలదీయరు?. ఉత్తరాంధ్రకు అశోక్ గజపతిరాజు ఏం చేశారు?. న్యాయ సమస్యలు పరిష్కారమయ్యాక మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను సీఎం జగన్ వ్యతిరేకించారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తన నిర్ణయం చెప్పిందని’’ బొత్స సత్యనారాయణ అన్నారు.