తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవోవర్ ఒక్కసారిగా కుప్పకూలింది ( Flyover collapse ). ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మధరై పట్టణంలో ఏడు కిలోమీటర్ల పొడవుతో ఒక ఫ్లైవోవర్ నిర్మాణం జరుగుతున్నది. శనివారం ఫ్లైవోవర్ కూలిన సమయంలో కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడు కిలోమీటర్ల ఫ్లైవోవర్‌లో ఐదు కిలోమీటర్ల మేర కూలిపోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. మరోవైపు ఫ్లైవోవర్ కూలడానికి కారణం ఏమిటి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులకు ద్వారా విచారణ చేయిస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లకు అడ్డంగా పడిన శిథిలాలను తొలగిస్తున్నారు.