ఆంధ్రప్రదేశ్

Guntur | గుంటూరులో పొలం వివాదంలో ఘర్షణ.. మాజీ సైనికుడి కాల్పుల్లో ఇద్దరి మృతి

ఏపీలోని గుంటూరు జిల్లాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ సైనికుడు ఎనిమిది రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. దీంతో తూటాలకు శివ, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కాల్పుల్లో ఆంజనేయులు అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి.

మాచర్ల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. పొలం వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగడంతో ఆర్మీ మాజీ జవాన్ మట్టా సాంబశివరావు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఘటనకు గల కారణాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.