తెలంగాణ

Nalgonda : సీఎం కేసీఆర్‌ పూడిక తీసిన చెరువుకు జలకళ

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో గమ్యాన్ని ముద్దాడుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన
మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రం జలశోభను సంతరించుకుంటున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.

కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ చెరువులో 2015 ఏప్రిల్ 26న సీఎం కేసీఆర్ పూడికతీత పనులు ప్రారంభించారు. మిషన్ కాకతీయ పథకాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ ఈ చెర్వు నుంచే పూడికతీతతో లాంఛనంగా ప్రారంభించారు.

గత రెండు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి సోమవారం ఉదయం నుంచి అలుగు పోస్తుంది. దీంతో ఆ ప్రాంత రైతులకు ఇక రెండు పంటలకు ఢోకా లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.