తెలంగాణ ముఖ్యాంశాలు

సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేర‌నున్నారు. 2వ తేదీన మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు పాల్గొన‌నున్నారు. సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు. ఢిల్లీలోని వ‌సంత్ విహారం మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం 1300 గ‌జాల స్థ‌లాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన సంగ‌తి తెలిసిందే.