జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఎల్ఎండీ రిజర్వాయర్ నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లోకి మోయ తుమ్మెద వాగు నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రిజర్వాయర్లో నీటి మట్టం భారీగా పెరుగుతున్నది. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్ లో22.5 టీఎంసీల నీటి మట్టం ఉండగా మరో టీఎంసీ నీటిమట్టం రాగానే ఎల్‌ఎండీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎల్‌ఎండీ నీటిమట్టం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ఉన్నత అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం వరకు గేట్లను తెరిచే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎల్ఎండీ పరివాహక ప్రాంతాల ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.