అంతర్జాతీయం ముఖ్యాంశాలు

క్రిస్టియానో రోనాల్డ్ వ‌ర‌ల్డ్ రికార్డు..

ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రోనాల్డో ( Cristiano Ronaldo )కొత్త చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. పోర్చుగ‌ల్ కెప్టెన్ రోనాల్డ్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌యింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ ఘ‌న‌త‌ను సాధించాడు. క్రిస్టియానో రోనాల్డ్ ఖాతాలో ఇప్పుడు 111 అంత‌ర్జాతీయ గోల్స్ ఉన్నాయి. ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో.. నాట‌కీయంగా పోర్చుగ‌ల్ 2-1 తేడాతో విక్ట‌రీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రోనాల్డో రెండు గోల్స్ చేశాడు. ఇరాన్ ఫుట్‌బాల్ ఆట‌గాడు అలీ డ‌యి పేరిట ఉన్న 109 అంత‌ర్జాతీయ గోల్స్ రికార్డును రోనాల్డో బ్రేక్ చేశాడు. 1993 నుంచి 2006 వ‌ర‌కు అలీ డ‌యి ఇరాన్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇటీవ‌లే మాంచెస్ట‌ర్ యునైటెడ్ జ‌ట్టులో చేరిన క్రిస్టియానో.. త‌న స‌త్తాను మ‌రోసారి చాటాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో.. 90 క‌న్నా ఎక్కువ గోల్స్ చేసిన ఆట‌గాళ్ల‌లో అలీ డ‌యి, రోనాల్డ్‌లు ఉన్నారు.