జిల్లాలోని బెజ్జూర్ మండలం పాపన్‌పేట గ్రామానికి చెందిన తుమ్మిడే సురేశ్, బుజాడి అంజయ్యకు చెందిన రెండు బర్రెలు పులి దాడిలో మృతి చెందాయి. మూడు రోజుల క్రితం పాపన్‌పేట అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన బర్రెలు తిరిగి రాలేదు. అప్పటి నుంచి అటవీప్రాంతంలో వెతుకుతుండగా, ఆదివారం పిట్టనీ చెలిమ లొద్ది ప్రాంతంలో బర్రెల కళేబరాలు కనిపించాయి.
వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో ఎఫ్‌బీవో వంశీ ఎనిమల్ ట్రాకర్స్ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కనిపించిన పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి దాడిలోనే బర్రెలు మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు రేంజ్ అధికారి దయాకర్‌కు వినపతి పత్రాలు సమర్పించారు. పులి జాడల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.