తెలంగాణ

Sunday Effect | ఎటుచూసినా ఆధ్యాత్మికమే.. యాదగిరిగుట్టలో భక్తజనసందోహం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా బక్తులు తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్‌రోడ్డుపై కాలు పెట్టడానికి వీలు లేకుండా భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్మ దర్శనం, వీఐపీ దర్శన క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులు దీరారు. ప్రసాద విక్రయశాల క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. హోటల్స్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటాలాడాయి. దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

ఉదయం నుంచి భక్తుల రాక..

శ్రావణ మాసం ముగుస్తుండడం, సెలవుదినం కావడంతో ఆదివారం ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనా లను అనుమతించలేదు దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకు న్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్ రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్ సిటీ, ఘాట్ రోడ్డు, రింగురోడ్డు కార్లతో నిడిపోయింది.

కొండకింద చెక్‌పోస్టు వద్ద ఘాట్‌రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అయినా భక్తులు స్వామి దర్శనం అనంత రం చెక్‌పోస్టు నుంచి బస్టాండ్ చేరుకోవడానికి 45 నిమిషాల పట్టిందని తెలి పారు. శ్రావణమాసం ముగుస్తుండడంతో సత్యనారాయణ స్వామి వ్రతమాచరించడా నికి భక్తులు భారీగా వచ్చారు. యాదా ద్రి కొండ కింద పాత గోశాల వద్ద వ్రత మండపం, పాతగుట్టలోని వత్ర మండపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత మాచరించారు.