అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

Paralympics | భారత్‌కు ఐదో స్వర్ణం..

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6లో కృష్ణ నాగర్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. హాంకాంగ్‌ ప్లేయర్‌ కైమన్‌ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌ గోల్డ్‌ సాధించిన విషయం తెలిసిందే.