అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఓ వ్య‌క్తిని కాపాడ‌బోయి.. నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయిన మంత్రి

ర‌ష్యా ఎమ‌ర్జెన్సీ శాఖా మంత్రి ఎవ‌జిని జినిచేవ్ త‌మ శాఖ‌కు చెందిన ఓ ఉద్యోగిని కాపాడ‌బోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌న ర‌ష్యా ఉత్త‌ర ప్రాంతంలో చోటుచేసుకున్న‌ది. విధుల్లో ఉండ‌గానే మంత్రి మ‌ర‌ణించిన‌ట్లు ఆ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. డ్రిల్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న ఓ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఎమ‌ర్జెన్సీ శాఖ నిర్వ‌హిస్తున్న‌ విన్యాసాల్లో పాల్గొనేందుకు మంత్రి జినిచేవ్ ఆర్కిటిక్ జోన్‌కు వెళ్లారని.. అక్క‌డ ఆయ‌న నాట‌కీయ ప‌రిణామంగా ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని, ఓ వ్య‌క్తిని ర‌క్షించ‌బోయి మంత్రి మృతిచెందిన‌ట్లు ఆ శాఖ తెలిపింది. నోరిల్క్‌ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫైర్ స్టేష‌న్‌ను త‌నిఖీ చేసేందుకు మంత్రి అక్క‌డ‌కు వెళ్లారు. కెమెరామెన్‌తో క‌లిసి ఓ బండ‌ చివ‌ర‌లో నిలుచున్న స‌మ‌యంలో.. ఆ కెమెరామెన్ నీటిలో ప‌డిపోయాడు. అయితే అత‌న్ని కాపాడేందుకు మంత్రి నీటిలోకి దూకేశారు. కానీ అక్క‌డ ఉన్న వాళ్ల‌కు ఏం జ‌రుగుతుందో తెలియ‌లేదు. డైవింగ్ స‌మ‌యంలో దెబ్బ త‌గ‌ల‌డంతో మంత్రి జినిచేవ్ మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.