అంతర్జాతీయం

నార్వే రాయబార కార్యాలయంలో తాలిబన్ల విధ్వంసం

ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని ఆక్రమించారు. అక్కడున్న మద్యం సీసాలు, పుస్తకాలను ధ్వంసం చేశారు. ఇరాన్‌లోని నార్వే రాయబారి సిగ్వాల్డ్ హౌజ్ ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. ‘తాలిబాన్లు ఇప్పుడు కాబూల్‌లోని నార్వేజియన్ రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు దానిని తర్వాత మాకు తిరిగి ఇస్తామని చెప్పారు. కానీ, మొదట అందులోని వైన్ బాటిళ్లను పగులగొట్టారు. పిల్లల పుస్తకాలను నాశనం చేశారు. తుపాకులు తక్కువ ప్రమాదకరమని స్పష్టమవుతున్నది’ అని పేర్కొన్నారు.

కాగా, రాయబార కార్యాలయాలతో సహా విదేశీ దౌత్య సంస్థల్లో తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చెప్పారు. అయితే దీనికి కట్టుబడని తాలిబన్‌ ఫైటర్లు కాబూల్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలను వరుసగా ఆక్రమించి విధ్వంసం సృష్టిస్తున్నారు.