మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండోరోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కొనసాగుతున్నది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో ఆయన హత్యకు గల కారణాలను సీబీఐ సేకరిస్తున్నది. ఈ క్రమంలో వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీశారు. అనంతరం కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది.
నలుగురు వ్యక్తులు వివేక ఇంట్లోకి ఎట్లా వచ్చారన్న విషయంపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకొని సీబీఐ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. మిగిలిన నిందితుల కోసం సీబీఐ ఆరా తీస్తోంది.