అంతర్జాతీయం

యెమెన్‌లో 50 మంది రెబ‌ల్స్ హ‌తం..

యెమెన్‌లో జ‌రిగిన సైనిక కాల్పుల్లో 50 మంది రెబ‌ల్స్ మృతిచెందారు. అల్ బైదా సెంట్ర‌ల్ ప్రావిన్సులో ప్ర‌భుత్వ ద‌ళాలు, రెబ‌ల్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆ కాల్పుల్లో హై ర్యాంక్ ఆఫీస‌ర్ ఒక‌రు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డుతున్న రెబ‌ల్స్ ద‌ళంలోని 50 మంది వ‌ర‌కు మృతిచెందిన‌ట్లు మిలిట‌రీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హౌతి రెబల్స్‌తో జ‌రిగిన పోరులో ఓ క‌ల్న‌ల్‌తో పాటు 19 మంది హౌతి మ‌ద్ద‌తుదారులు మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌భుత్వ మిలిట‌రీ అధికారి ఒక‌రు తెలిపారు. ఘ‌ర్ష‌ణ‌లు, వైమానిక దాడుల్లో మ‌రో 30 మంది రెబ‌ల్స్ కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చెప్పారు. ఇరాన్ మ‌ద్ద‌తు ఉన్న రెబ‌ల్స్ ఇటీవ‌ల అల్ బైదా ప్రావిన్సులో త‌మ ప్రాబ‌ల్యాన్ని పెంచుకున్నారు. ఉత్త‌ర దిక్కున ఉన్న వ్యూహాత్మ‌క మారిబ్ న‌గ‌రాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు రెబ‌ల్స్ ప్ర‌య‌త్నించారు.