అంతర్జాతీయం

రోదసిలో తొలి సినిమా షూటింగ్‌

రోదసిలో తొలి సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇద్దరు వ్యోమగాములు, ఇద్దరు సినీరంగ నిపుణులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లనున్నారు. వీరిని వచ్చే నెల 5న ‘సోయజ్‌ ఎంఎస్‌-19’ అనే అంతరిక్ష వాహనంలో ఐఎస్‌ఎస్‌కు రష్యా పంపుతున్నది. అంతరిక్షయానం గురించి ఎప్పుడూ ఆలోచన కూడా చేయని ఓ వైద్యుడు… అనూహ్యంగా వ్యోమగామిని కాపాడేందుకు రోదసికి వెళ్లాల్సి రావడం సినిమా ఇతివృత్తమని దర్శక నిర్మాతలు తెలిపారు.