జాతీయం

అధికారులు ఉన్నది.. చెప్పులు మోసేందుకే!

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో శనివారం జరిగిన ఓ ప్రైవేట్‌ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల చెప్పులను మోసేందుకే ప్రభుత్వ అధికారులు పనికివస్తారన్నారు. రాజకీయ నేతలను నియంత్రించే శక్తి వారికి లేదని ఎద్దేవా చేశారు. ఆమె వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. దీంతో స్పందించిన ఉమ.. అనధికారిక సమావేశాల్లోనూ సంయమనంతో మాట్లాడాలన్న విషయం తనకు తెలిసొచ్చిందని పేర్కొంటూ.. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.