పెట్రో మంట కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బుధవారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.24కు, డీజిల్ ధర రూ.91.77కు చేరింది.
ఇక ముంబైలో పెట్రోల్ 29 పైసలు పెరిగి రూ.109.25కు పెరగగా, డీజిల్ 38 పైసలు అధికమై రూ.99.55కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.103.94 (29 పైసలు), డీజిల్ రూ.94.88 (35 పైసలు), చెన్నైలో పెట్రోల్ రూ.100.75 (26 పైసలు), డీజిల్ రూ.95.26 (33 పైసలు)కు చేరాయి.
కాగా, హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. దీంతో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటింది. ప్రస్తుతం డీజిల్ ధర రూ.100.13కు చేరగా, పెట్రోల్ రూ.107.41కు పెరిగింది. నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.