కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ప్రభావం కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా 15 వేలకు దరిదాపుల్లోనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 15,768 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా కరోనా మహమ్మారి బారి నుంచి రికవరీ అయిన వారి సంఖ్య కూడా ఇవాళ 21,367గా నమోదైంది. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 43,54,264కు పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 214 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,897కు పెరిగింది. ఇవాళ మొత్తం 1,05,513 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 15,768 మందికి పాజిటివ్ వచ్చింది.