జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో కొత్తగా 26 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు186 రోజుల్లో 3 లక్షల 2 వేలకు దిగువకు చేరడం ఇదే మొదటిసారి.

కాగా, గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 82,65,15,754 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.