ఆంధ్రప్రదేశ్

CBI : రెండో రోజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 107వ రోజుకు చేరింది. వైఎస్‌ఆర్‌ కడపలోని జిల్లా కేంద్ర కారాగార అతిథి గృహంలో విచారణ జరుగుతున్నది. ఇందులో భాగంగా రెండో రోజు మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సీబీఐ అధికారులు ఇప్పటికే పలు చానెళ్లకు నోటీసులు సైతం అందజేశారు. ఈ కేసలో ప్రత్యేక్ష సాక్షి, వివేకానందరెడ్డి ఇంటి కాపలాదారుడైన రంగన్న వాంగ్మూలాన్ని జమ్మలమడుగు కోర్టులో సీబీఐ తీసుకున్న విషయం విదితమే.

మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన రోజు ఇద్దరు వ్యక్తులను చూసినట్లు రంగన్న తన వాంగ్మూలంలో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అప్పట్లో పలు ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో రంగన్న వాంగ్మూలానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచురించాయి. ఆ ఇద్దరు ఎవరంటూ కొన్ని ఊహాచిత్రాలను ప్రసారం చేశారు. ఆ చిత్రాలు ఎవరివనే దానిపై సీబీఐ అధికారులు నిన్న మీడియా ప్రతినిధులను విచారించిన విషయం తెలిసిందే. ఇవ్వాళ కూడా విచారణ కొనసాగుతున్నది.