ఆంధ్రప్రదేశ్

ఏపీలో సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్‌మాల్‌

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులను గోల్‌మాల్ అయ్యాయి. ఈ మేరకు ఆ భారీ స్కామ్‌ను ఏసీబీ గుట్టురట్టు చేసింది. పేదల డాటా సేకరించి, సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఇందులో 50 మంది ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.