ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ & జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని.. ఈ జల్‌జీవన్ మిషన్ అనేది పూర్తిగా గ్రామాలు నడిపించే, గ్రామాల్లోని మహిళలు నడిపించే ఉద్యమం అని వ్యాఖ్యానించారు. మాస్ మూవ్‌మెంట్, పబ్లిక్ పార్టిసిపేషనే దీనికి ప్రధాన ఆధారమని చెప్పారు.
జల్‌జీవన్ మిషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించిన సమస్త సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుందన్నారు. ఇక నుంచి దేశంలోని లక్షల గ్రామాల ప్రజలు గ్రామ సభల ద్వారా జల్ జీవన్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించుకంటారని చెప్పడం ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ఉద్దేశం కేవలం ప్రజలకు నీటి సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదని, ఇదొక పెద్ద వికేంద్రీకరణ ఉద్యమమని ఆయన చెప్పారు.