జాతీయం ముఖ్యాంశాలు

వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రో ధరల పెంపు కొనసాగుతున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను భారం మోపాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.104.14కు చేరగా, డీజిల్‌ ధర రూ.92.82కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ ధర 29 పైసలు పెరిగి రూ.110.12కి, డీజిల్‌ ధర 37 పైసలు పెరిగి రూ.100.66కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పను అధికమయ్యాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.33, డీజిల్‌ ధర రూ.101.27కు చేరాయి.

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.104.80, డీజిల్‌ రూ.95.93
చెన్నైలో పెట్రోల్‌ రూ.101.53, డీజిల్‌ రూ.97.26
బెంగళూరులో పెట్రోల్‌ రూ.107.77, డీజిల్‌ రూ.98.52
జైపూర్‌లో పెట్రోల్‌ రూ.112.06, డీజిల్‌ రూ.103.08