జాతీయం ముఖ్యాంశాలు

యూపీలో మ‌రోసారి కాషాయ స‌ర్కార్‌కు ప‌ట్టం క‌ట్టాలి : అమిత్ షా

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ ఓట‌ర్ల‌పై వ‌రాలు గుప్పిస్తోంది. యూపీలోని దిబియ‌పూర్‌లో నేడు జ‌రిగిన ప్ర‌చార ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేప‌డ‌తార‌ని బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు మీ ఇంటికి చేరుకుంటాయ‌ని అమిత్ షా పేర్కొన్నారు. ఇక రాబోయే ఐదేండ్ల‌లో రైతులెవ‌రూ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. యూపీలో మ‌రోసారి యోగి ఆదిత్యానాధ్ సార‌ధ్యంలోని కాషాయ స‌ర్కార్‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న అభ్య‌ర్ధించారు. ఈనెల 18న హోళీ రోజు యూపీ ప్ర‌జ‌లు కాషాయ పార్టీ విజ‌యంతో సంబ‌రాలు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.