అంతర్జాతీయం

security threats | ఆ హోటళ్లకు వెళ్లొద్దు.. తమ పౌరులకు యూకే, యూఎస్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, తమ పౌరులు హోటళ్లకు దూరంగా ఉండాలని అమెరికా, బ్రిటన్‌ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రత్యేకంగా సెరెనా హోటల్‌ దరిదాపుల్లో కూడా ఉండకూడదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఆ ప్రాంతంలో రక్షణ పరమైన సమస్యలు ఉన్నాయని తెలిపింది.

అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లకూడదని బ్రిటన్‌ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ హోటళ్లలో ఉండటం అంత సురక్షితం కాదని, ప్రత్యేకంగా కాబుల్‌లోని హోటళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.

కాబూల్‌లో ఉన్న అత్యున్నత లగ్జరీ హోటళ్లలో సెరెనా ఒకటి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి.